నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ అభివృద్ధి పనుల కోసం బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది పాదం తిరుపతి రూ. 50 వేల విరాళం అందజేశారు. బుధవారం దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ గా ముదాం గౌతమి జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం చొరవ చూపుతూ పాదం తిరుపతి తన తల్లిదండ్రులు కీ. శే పాదం రాజవ్వ, రాజయ్య జ్ఞాపకార్ధం రూ. 50 వేల చెక్కును నూతన పాలక వర్గానికి అందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణారెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఐలయ్య, ఉపసర్పంచ్ మామిడిపల్లి శ్రీమతి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు





