నేటి సాక్షి డిసెంబర్ 24 పాములపాడు :—మండల కేంద్రం లో ఉన్నటువంటి CSI సంఘములో రెవరెండ్. వేల్పుల. యం. మోహన్ రాజ్ గాంధీ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పగా ఘనంగా జరిగాయి.ఈ ప్రార్ధన కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా వేల్పుల.ఆనంద్ కుమార్ ఐఆర్ ఎస్ వారు రావడం జరిగింది. వేల్పుల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ మనకోసం మన పిల్లల కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మానవరూపంలో ఈ భూలోకం లో మన కోసం జన్మించారు. ఆయన ప్రేమ, కరుణ, ద్వారానే మానవాళికి ఆనందం, నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికి ఆదర్శప్రాయంగా, ఏసుక్రీస్తు జన్మదిన పర్వదినాన్ని, ప్రజలంతా ప్రతి ఒక్కరి కుటుంబం లో ఆనందం నింపడానికి, శత్రువుల సైతం మంచి ప్రవర్తనతో, మారుమనస్సు పొంది, ప్రతి ఒక్కరూ నిత్య పరలోక రాజ్యానికి, వారసులం కావాలి అని అజ్ఞానం నుండి విజ్ఞానo వైపు నడిపేది ఒక దైవస్వరూపం అని యేసుక్రీస్తు మనకోసం కన్యకా అయిన గర్భవతి మరియమ్మ కి యేసుక్రీస్తు జన్మించారు.ఎందుకు అంతే మన కోసం మనం అందరం పరలోకానికి వారసులం కావాలని కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు ప్రతి క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగులు నింపుతారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడు దీవెనలు మీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని చెప్పడం జరిగింది.పాస్టర్ యు.రాజు వారి దైవ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరు శాంతి సమానత్వం ప్రేమ దయ కలిగి దేవుడు కి భయభక్తులు కలిగి జీవించాలి.చెప్పడం జరిగింది.అంతేకాకుండా పాములపాడు పాస్టర్ మోహన్ గాంధీ వారు మాట్లాడుతూ ఈరోజు మన మండల కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన వేల్పుల ఆనంద్ కుమార్ సార్ రావడం చాలా గొప్పగా అదృష్టంగా భావించాలి.అంతేకాకుండా వేల్పుల ఆనంద్ కుమార్ మన మండలంలో చర్చిలకు, మిట్టకందల గ్రామంలోని చర్చికి చేసిన ఆర్థిక సహాయం చాలా గొప్పది.ఒక్కటే కాదు అడిగిన ప్రతి ఒక్కరికి సేవా గుణం తో ముందుకు వెళ్తున్నారు.కాబట్టి ఇంకా ఇంకా మున్ముందు మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అందరి మన్ననలు పొందాలని మరీమరీ కోరుకుంటున్నాను.వేల్పుల.ఆనంద్ కుమార్ సార్ కుటుంబాల్లో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో దేవుడు దీవెనలను ఇవ్వాలని పాస్టర్ మోహన్ గాంధీ వారు చెప్పడం జరిగింది.మౌనిక పాస్టర్ అమ్మ వారు దేవుడు పాటలతో దేవుడు మహిమపరచారు. మరియు యు రాజు వారు దైవ సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ దేవునికి వారసులం కావాలి చెడు పనులు వదిలేసి మారు మనసు కలగాలి.ప్రతి ఒక్కరి గుండెల్లో యేసుప్రభూ చేర్చుకోవాలి. అందరూ పరలోక రాజ్యానికి వారసులం కావాలి అని వివరించారు.,మరియు అంతేకాకుండా ప్రార్థన కి వచ్చిన వేల్పుల ఆనంద్ కుమార్ సార్. కి సీఎస్ ఐ సంగస్థులు పూలదండలు వేసి,శాలువాలతో, సన్మానించడం జరిగింది. అంతే కాకుండా వచ్చిన ముఖ్య అతిధులకు కూడా సన్మానం చేయడం జరిగింది..ఈ కార్యక్రమం లో పిల్లలతో దేవుడు నీ పాటలతో, దేవుని నృత్యం లతో చక్కటి,సంగీత బృందం తో మరియు దేవుడు కి మహిమ కరముగా జరిపించింబడ్డాయి. ఈ కార్యక్రమం లో గట్టు.శంకర్ గౌడ్ బత్తుల.సంజీవ రాయుడు, ఎల్లగౌడ్ వినోద్, డక్క.శ్రీకాంత్ సోషల్ మీడియా ప్రతినిధి,మేకల.భాస్కర్ అంతే కాకుండా సి ఎస్ ఐ, సంఘములో సంఘ పెద్ద మనుషులు, సండే స్కూల్ టీచర్, అనురాధ, స్త్రీల మైత్రి వారు పాల్గొనడం జరిగింది.మరియు కలబండి, విజయ భాస్కర్, కలబండి, బాలరాజు, రఘు, మరియు కలబండి యూత్. నాగరాజు గారి ఆధ్వర్యంలో అద్భుతంగాచేసిన పరిచర్యలో వాడబడటం, మరియు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నల్లమల్ల అబ్రహం,మరియు నంద్యాల జిల్లా కార్యదర్శి, కలబండి. అంకన్న. మరియు వచ్చిన వారందరికీ ప్రేమ విందు పెట్టడం జరిగింది.సంఘము విశ్వాసులు, పెద్దలు కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవంతంగా జరిగాయి.





