Monday, March 16, 2026

తంబళ్లపల్లి నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న రాజంపేట ఎంపీ ని మర్యాదపూర్వకంగా కలిసిన – నిస్సార్ అహ్మద్ దేశాయ్ తిప్పారెడ్డి, నరేష్ కుమార్ రెడ్డితేనీరు సేవిస్తూ మదనపల్లి అభివృద్ధిపై ఆరా..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 24 ~అన్నమయ్య జిల్లా :-: తంబళ్లపల్లి నియోజకవర్గ పర్యటనకు రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలు వెళ్తున్న సందర్భంలో బైపాస్ రోడ్డు లో గల మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు ఆయన స్వగృహం వద్ద తేనీటి విందుకు కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంలో మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి లను మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, మాజీ శాసనసభ్యులు దేశాయ్ తిప్పారెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు. నిస్సార్ అహ్మద్ దుశ్శాలువ కప్పి పూల బొకే అందించి కొద్దిసేపు ముచ్చటించారు. మదనపల్లి స్థితిగతులను ఆరా తీశారు. త్వరలోనే మదనపల్లె పర్యటనకు విచ్చేయడం జరుగుతుందని మిధున్ రెడ్డి తెలిపారు. ‌మదనపల్లి జిల్లా కావడాన్ని హర్షిస్తున్నామని మదనపల్లి ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని మిథున్ రెడ్డి తెలిపారు. మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి లను కలిసేందుకు మదనపల్లి పట్టణ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తేనీటి విందు స్వీకరించి తంబళ్లపల్లి పర్యటనకు బయలుదేరారు. అంగళ్లు లోను స్థానిక వైసీపీ శ్రేణులు బైసాని చంద్రశేఖర్ రెడ్డి, టెలికాం అడ్వైజరీ సభ్యుడు ముట్ర దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి ఆర్ సి ఈశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు డిష్ కుమారి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు దేవి రెడ్డి పద్మజా రెడ్డి, ఎంపీపీ భూదేవి, మండలాధ్యక్షురాలు నక్క రమాదేవి, మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సర్పంచులు ఆర్కే కృష్ణారెడ్డి, ఈశ్వర, ఎంపీటీసీ గోపాల్ రెడ్డిలు మర్యాదపూర్వంగా కలిసి దుశ్శాలువలు కప్పి పూల బొకే అందించి కొద్దిసేపు ముచ్చటించారు. పేరుపేరునా పలకరించి స్థితిగతులను అడిగి విచారించారు. పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు అండగా నిలవాలని వారికి ఏ సమస్య వచ్చిన తక్షణమే పరిష్కారం చేయాలని సూచించారు. తదనంతరం బి. కొత్తకోట పర్యటనకు బయలుదేరారు. ~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News