నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 24పుంగనూరు మండలంలోని చదళ్ల గ్రామంలో 11కెవి విద్యుత్ లైను షాక్ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.చదళ్లలో నివాసం ఉన్న బ్రహ్మయ్యకు పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకి చెందిన వాసు(40) తో పరిచయం ఉంది.ఇలా ఉండగా తన ఇంటిలోనికి పాము వచ్చిందని వాసుకు బ్రహ్మయ్య ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు.పామును కొట్టే సమయంలో పాము మిద్దిపైకి వెళ్లిపోవడంతో వాసు మిద్దిపైకి వెళ్లే సమయంలో విద్యుత్ లైన్లు షాక్ కొట్టడంతో పై నుంచి క్రింద పడి తలకు తీవ్రగాయాలైంది.వెంటనే బ్రహ్మయ్య గాయపడిన వాసును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి,శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.





