నేటి సాక్షి,, నారాయణపేట, డిసెంబర్,25,నారాయణపేట జిల్లా మిథికల్ మండల కేంద్రంలో, గురువారం క్రిస్మస్ వేడుకలను రాయచూర్ వెళ్లే రహదారిలో ఉన్నటువంటి చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారికి శాలువాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు నుండి చర్చి వరకు రోడ్డు నిర్మాణ పనులను త్వరగతిన చేపడతామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ సర్పంచ్ గూప చెన్నయ్య, ఉప సర్పంచ్ గోరె కాజా, మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, ఓ బి సి జిల్లా నాయకులు గొల్ల కృష్ణయ్య, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న, చర్చి నిర్వాహకులు ముత్యాలు, శివయ్య, పి .రమేష్, అశోక్, కృష్ణ, కురుమయ్య, దేవేందర్, విజయ్ కుమార్, కృష్ణయ్య, జనార్ధన్, రాజయ్య, శ్రీనివాసులు, ఎల్లయ్య, వైజాగ్ బాలు, రమేష్, యాదగిరి, మారెప్ప, మరికల్ గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు , మహిళలు,తదితరులు పాల్గొన్నారు.





