Monday, March 16, 2026

*నేడు జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి.**శతాబ్ది ఉత్సవాలకు సిపిఐ జాతీయ నేత కె.నారాయణ రాక*

(నేటి సాక్షి తిరుపతి బాదూరు బాల)సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్.రేపు తిరుపతి నగరంలో జరిగే శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జల్లా విశ్వనాధ్ మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన సిపిఐ పార్టీ అని అన్నారు. భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, అమూల్యమైన త్యాగాలు, సమరశీల పోరాటాలు, లక్షల ఎకరాలు భూమిని పేదలకు పంచిన చరిత్ర, వందేళ్ల ఘనమైన చరిత్రతో శతాబ్ది వార్షికోత్సవాలు సిపిఐ పార్టీ జరుపుకుంటుందని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నినాదం ప్రకృతి సంపద అందరిదీ అని, సంపదను సృష్టించే శ్రమకు విలువ ఇవ్వాలని, మనిషిని మనిషి దోపిడీ చేయడానికి వ్యతిరేకిస్తూ, భారతదేశంలో అంటరానితనం, వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం పనిచేయడమే కమ్యూనిస్టులు లక్ష్యమని పేర్కొన్నారు. తిరుపతి నగరంలో వేలాదిమంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంచి 26 కాలనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సిపిఐ పార్టీదేనని అన్నారు. తిరుపతి నగరంలో రౌడీ మూకలకు వ్యతిరేకంగా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ సిపిఐ అని ఇంత ఘన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను రేపు ఉదయం 10 గంటలకు బైరాగి పట్టెడ రాయలసీమ కాలేజీ వద్ద నుండి గంధంనేని శివయ్య భవన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సభకి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ నేత కె నారాయణ , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి .హరినాథ్ రెడ్డి హాజరవుతున్నారు. కావున శతాబ్ది ఉత్సవాలలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News