Monday, March 16, 2026

*యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మేలు చేసే మార్గదర్శక సూత్రాలు మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కుసుంబ రఘుపతి

నేటి సాక్షి, నల్లబెల్లి డిసెంబర్ 25 : యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మేలు చేసే మార్గదర్శక సూత్రాలని,అవి ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన విలువలను బోధిస్తాయని నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కుసుంబ రఘుపతి అన్నారు. నల్లబెల్లి మండలలోని రంగాపురం చర్చి లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా కుసుంబ రఘుపతి మాట్లాడుతూ,ప్రేమ,క్షమ,సేవ, త్యాగం వంటి యేసుక్రీస్తు బోధనలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.కుల,మత, వర్గ భేదాలు లేకుండా అందరూ మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.క్రిస్మస్ పండుగ మానవాళికి ఆశ, ఆనందం,పరస్పర గౌరవం అనే సందేశాన్ని అందిస్తుందని అన్నారు.అంతకుముందు చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో రఘుపతి పాల్గొని,ప్రజల సుఖసంతోషాలు,రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్లు యేసుక్రీస్తు జన్మ మహత్యాన్ని,ఆయన బోధనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో రంగాపురం లో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఓరుగంటి మాధురి&రాజు, వార్డ్ మెంబర్ ఉప్పల ఆమని,కుసుంబ విశ్వ తేజ,మందల సుజాత,ఎలబోయిన మల్లక్క,కోడపాక పోషాలు, శ్రీను రాజు,గ్రామ పార్టీ నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News