Thursday, March 12, 2026

*తిరుమల పాదయాత్రకు వెళుతూ స్కూటర్ ఢీకొని వృద్ధుడి మృతి*

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 25 తిరుమలకు పాదయాత్ర కోసం వెళుతూ స్కూటర్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన చౌడేపల్లిలో చోటుచేసుకుంది.పుంగనూరు మండలం ప్రసన్నయ్య గారి పల్లికీ చెందిన గుండ్లపల్లి శ్రీరాములు (62) భక్తుల సహకారంతో తిరుమలకు పాదయాత్ర కోసం వెళుతున్నారు.ఈ క్రమంలో పెద్ద ఎల్లకుంట్ల దాటగానే చౌడేపల్లి పుంగనూరు ప్రధాన రహదారిలో వెనుకవైపు నుంచి వస్తున్న టూవీలర్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News