Saturday, March 14, 2026

నేడు CPI ఆవిర్భావ దినోత్సవంఅజేయమైనది కమ్యూనిజం – అజరామరమైనది సోషలిజం

నేటి సాక్షి,కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ఆవరణలో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ గారు జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,1925 డిసెంబర్ 26న స్థాపితమైన భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో ఏర్పడిన తొలి రాజకీయ పార్టీ అని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తూ, ఎన్నో సమరాలు, అనేక త్యాగాలు చేసిన ఘన చరిత్ర సీపీఐదని అన్నారు. అమరవీరుల అరుణ రక్తపు ధారకు సాక్షిగా ఎరుపెక్కిన ఎర్ర జెండా వందేళ్లుగా గర్వంగా రెపరేపలాడుతూనే ఉందన్నారు.దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పలువురు విప్లవకారులు, దేశభక్తులు కలిసి కాన్పూర్‌లో సమావేశమై భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు సభ నిర్వహించారని, అదే CPI ఆవిర్భావ దినమని వివరించారు. ప్రజా సమస్యలపై పాలక వర్గాలపై పోరాటాలు నిర్వహిస్తూ అగ్రభాగాన నిలిచిన పార్టీ సీపీఐ అని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని, దొరల దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడి, రజాకార్లపై రణం చేసి విజయం సాధించిందన్నారు. వెట్టి చాకిరిని నిర్మూలించి, శిస్తు కట్టబోమనే పోరాటాలతో నైజాం పాలనకు ముగింపు పలికిందని తెలిపారు.“దున్నేవాడికే భూమి” నినాదంతో లక్షలాది ఎకరాల భూమిని భూమిలేని పేదలకు పంపిణీ చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీదేనని పేర్కొన్నారు.అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులు అశేష త్యాగాలు చేశారని, బ్యాంకుల జాతీయీకరణలో, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు లో సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. సీపీఐ వందవ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి దివాకర్ గౌడ్, సీపీఐ జిల్లా నాయకులు పిడుగు శంకర్, సీపీఐ మండల కార్యదర్శి అజయ్ తదితరులు పాల్గొన్నారు.CPI జిందాబాద్విప్లవాభివందనలతో…—ఆత్మకూరి చిరంజీవిసీపీఐ జిల్లా సహాయ కార్యదర్శికొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News