Monday, March 16, 2026

శుక్రవారం నాడు మస్జిద్ – ఎ – ముక్దాస్ లో నమాజ్ చదివి ముస్లిం సోదరులకు ఉపదేశం చేసిన నిస్సార్ అహమ్మద్..ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు..మసీదులలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు (జుమా నమాజ్) చేయడం ఆనవాయితీ..నేటి

సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 26 ~అన్నమయ్య జిల్లా :-: పవిత్ర శుక్రవారం రోజున ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులు మసీదులో నిర్వహించే ప్రార్థనలలో పాల్గొని ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, పరోపకారం, దానధర్మాలు సమజ హితం కోసం పాటుపడే విధంగా సన్మార్గంలో నడవడం అల్లాహ్ కు ప్రియమైందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ అన్నారు. ముస్లిం అని అనిపించుకున్న వాళ్లు శుక్రవారం నాడు (జుమా) మధ్యాహ్న సమయంలో ఆయా మసీదులలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు (జుమా నమాజ్) చేయడం అలవర పరచుకోవాలని నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు మదననపల్లి పట్టణ పరిధిలోని బికే.పల్లి 2 వ వార్డు మస్జిద్ – ఎ- ముక్దాస్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనాలని ముస్లిం మైనార్టీ సోదరులు ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని సమ్మతించిన నిస్సార్ అహ్మద్ అనుచరులతో కలిసి తోటి ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి విచ్చేశారు. మసీదు వద్దకు విచ్చేసిన నిస్సార్ అహ్మద్ ను ముస్లిం మైనార్టీ సోదరులు, స్దానిక ముస్లిం మత పెద్దలు, ముతవల్లి లు ఘనంగా స్వాగతం పలికారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామ పెద్దలను ఆత్మీయ పలకరింపుతో యోగక్షేమాలు అడిగి విచారించారు. మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు గౌరవ మర్యాదలతో దుశ్శాలువాలు కప్పి, పూల బొకే అందించి మసీదు లోనికి ఆహ్వానించారు. అనంతరం తోటి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నమాజ్ చదివి వినిపించారు. ముస్లిం మైనార్టీ సోదరులకు పలు ఉపదేశాలను వినిపించారు. ఈ కార్యక్రమంలో హనీఫ్, కరీముల్లా, షంషీర్, హనీఫ్, నూరుల్లా, షఫీ, జాఫర్, బావాజన్, అబిద్, యూనస్, నవాజ్ అలీ ఖాన్, నూర్ మొహిద్దీన్, ఫక్రుద్దీన్, జైనుద్దీన్, నాసిర్, ఇలియాస్, హబీబ్, ఫయాజ్, సత్తార్, రియాజ్, షానవాజ్, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News