:నేటిసాక్షి ప్రతినిధి (సతీష్):ఇటీవల మండల కేంద్రంలో తన విజయ బావుట నెగుర వేసి ఇల్లంతకుంట సర్పంచ్ పీఠం ఆదిష్టించిన మామిడి రాజును మరియు తాళ్లపెల్లి మీసాల కనకరాజును ఉప సర్పంచ్ ఎలుక రామ స్వామి, రేపాక ఉప సర్పంచ్ కోదాని మహేష్, ముస్కాన్ పేట్ ఉప సర్పంచ్ దాసరి లావణ్య శ్రీనివాస్ లను మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య మరియు మండల మాల మహానాడు నాయకులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయితీ కార్యాలయం వద్ద వారిని శాలువాళతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో మన మాల సామాజిక వర్గం ముద్దు బిడ్డలు తమ సత్తా చాటి ప్రజా ప్రతినిదులుగా ఎన్నికై మాల సామాజిక వర్గానికి గర్వకారణంగా నిలిచారని వారిని ఆయన కొనియాడారు.అంతే గాకుండా నేటి రాజకీయాల్లో మన పతాక ఎగురవేసిన నేడు గెలిచిన మామిడి రాజు ఇతర ప్రజా ప్రతినిధులను ఆదర్శంగా తీసుకొని మన ఉనికి చాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జిల్లా మాల మహానాడు రాష్ట్ర నాయకులు దామెర సత్యం,జిల్లా అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గూడ బాబు, నీరటి కిరణ్ కుమార్, దామెర నర్సయ్య, సొల్లు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.





