Monday, March 16, 2026

*డిసెంబర్ 31న పింఛన్లు పంపిణీ.* *కమిషనర్ ఎన్.మౌర్య.*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*ఒక్క రోజు ముందుగానే డిసెంబర్ 31 వ తేదీన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం కావడంతో ఈ నెల 31 వ తారీఖునే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. లబ్ధిదారులు అందరూ డిసెంబర్ 31న పింఛన్లు అందుకుని, ఆనందంతో నూతన సంవత్సరం లోకి అడుగుపెట్టాలని కమిషనర్ ఎన్. మౌర్య ఆ ప్రకటనలో అకాంక్షించారు.*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News