నేటి సాక్షి నారాయణపేట డిసెంబర్ 26, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ని జమా మసీదులో శుక్రవారం నాడు మరికల్ మైనార్టీ ముస్లింల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డికి మరికల్ గ్రామ సర్పంచ్ ఉప చెన్నయ్య కు వార్డు సభ్యులకు శాలువలతో పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవాలని వారు వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మరికల్ గ్రామ ఉపసర్పంచ్ కటికే గోరఖ్ కార్యక్రమంలో మరికల్ గ్రామ ఉపసర్పంచ్ కటికే ఖాజా, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న, మరికల్ పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, ముస్లిం మైనార్టీలు పెద్దలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





