Monday, March 16, 2026

బంగారుగడ్డలో కుర్ర విష్ణు ద్వితీయ వర్ధంతి వేడుకలు

నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని 30వ వార్డు బంగారుగడ్డ మైసమ్మ గుడి ఆవరణలో దివంగత పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు ద్వితీయ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, కాలనీ వాసులు కుర్ర విష్ణు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బంగారుగడ్డ 29, 30, 31వ సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ మగ్దున్ పాషా, లింగంపల్లి చిరంజీవి, సాధినేని శ్రీనివాస్, ఐల వెంకన్న, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎర్రమళ్ళ దినేష్, ధనమ్మ, 29వ వార్డు దోనేటి సైదులు, బాలే సయ్యద్, జమీర్, సయ్యద్, చోటు, 30వ వార్డు వంగల బిక్షం రెడ్డి, నూనె రవి, కంచరకుంట్ల దయాకర్ రెడ్డి, బంటు సైదులు, నేరళ్ళ నాగేష్, సజ్జద్, ఫర్వేజ్, జంగయ్య, నేరళ్ళ బక్కయ్య, నల్లగంతుల నాగభూషణం, నక్క కృష్ణ, నక్క శివ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News