Monday, March 16, 2026

బాక్సింగ్ లో మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించిన : ఎమ్మెల్సీ శంకర్ నాయక్

నేటిసాక్షి, మిర్యాలగూడ : ఉమ్మడి నల్లగొండ జిల్లా బాక్సింగ్ ఫెడరేషన్ నిర్వహించిన బి.ఎఫ్. ఐ 9వ బాల, బాలికల రంగారెడ్డి ఎమెచ్యూర్ బాకీసింగ్ అసోసియేషన్ స్టేట్ టీం సెలెక్షన్ లు ఈనెల19,20,22 తేదీలలో హైదరాబాద్ లో షేక్పేట్ బాక్సింగ్ క్లబ్ జి.హెచ్.ఎం.సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ సెలక్షన్స్ లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం దామచర్ల కు చెందిన ధనావత అజయ్ 80- 85 కె.జి క్యాటగిరిలో సత్తా చూపించి, సిల్వర్ మెడల్ సంపాదించారు. అదేవిధంగా మిర్యాలగూడ సుందర్ నగర్ కు చెందిన మొండి కార్ అవినాష్ 75 – 80 కేజీల క్యాటగిరి లో బ్రౌన్ట్ మెడల్ కైవసం చేసుకొని సత్తా చూపించారు. సూర్యాపేట కు చెందిన మహేష్ 85-90 క్యాటగిరి లో బ్రాన్ట్ మెడల్ ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా వీరిని శుక్రవారం ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వారి కార్యాలయంలో, మెడల్స్ సాధించిన విద్యార్థులను శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు బాక్సింగ్ లో కోచింగ్ ఇస్తూ, మెడల్సే లక్ష్యంగా విద్యార్థులు తయారు చేస్తున్న బాక్సింగ్ కోచ్ రవీందర్ గౌడ్ ను ,డిస్టిక్ జనరల్ సెక్రెటరీ ఇరువెంటి ప్రవీణ్ అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News