నేటి సాక్షి,నల్లబెల్లి, డిసెంబర్ 26 : రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ వల్ల వ్యాధుల బారిన విద్యార్థులు పడకుండా వెంటనే ప్లాంటర్ మూసివేయాలంటూ నల్లబెల్లి ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ కారణంగా కస్తూర్బా గురుకుల విద్యార్థులు, రామాలయం గుడికి వచ్చే భక్తులు దుమ్ము–ధూళితో అనేక రోగాల బారిన పడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోక నిర్వహించారు.గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా అనుమతులు తీసుకుని జనావాసాల మధ్య ఈ ప్లాంట్‌ను నడుపుతున్నారని మహేష్ ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌తో పాటు ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు.రాస్తారోక కారణంగా రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుగ్గొండి సీఐ సాయి రమణ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు నిరసన విరమించారు.ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, మేకల మోహన్, గాజు బిక్షపతి, కన్నెబోయిన సురేష్, బత్తిని హరీష్, పరికి పవన్, త్యాగరాజు, కోడూరి సిద్ధు, పోలేటి కిషోర్, కుక్కమూడి నాగరాజు, దండు సునీల్, కుక్కమూడి సుమన్, పోడేటి కిరణ్, భాస్కర్, పవన్, పల్లికొండ రవి, మాసంపెళ్లి ప్రభాకర్, నాగేల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.





