నేటి సాక్షి-మంచిర్యాల్ జనవరి 24 ( శ్రీధర్ దమ్మ )మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ గోదావరి రోడ్డుకు చెందిన చిక్రం సాయి కిరణ్ ( 27 ) అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు. ఎస్సై గోపతి సురేష్ తెలిపారు స్థానిక ఒక మహిళకు తన భర్తతో విడాకులు కావడంతో కొద్ది రోజులుగా ఇంట్లో ఉండటాన్ని గమనించిన నిందితుడు తనకు తరచూ ఫోన్ చేస్తూ మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని ప్రేమిస్తున్నానని శారీరకంగా వాడుకొని బాధితురాలు పెళ్లి చేసుకోవాలని కోరడంతో పెళ్లికి నిరాకరించగా వాయిదాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది అని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ అన్నారు లక్షట్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా మహిళల పట్ల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇబ్బందులకు గురిచేసిన వదిలేది లేదు అని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.





