Wednesday, March 11, 2026

సవతి తల్లి ప్రేమతో గజ్వేల్‌కు అన్యాయం.. కేసీఆర్ రాజకీయ మోసం బయటపెట్టిన నర్సారెడ్డి

నేటి సాక్షి గజ్వేల్ :గజ్వేల్ నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ప్రజల సొమ్మును అప్పనంగా మేస్తూ ఎమ్మెల్యే కేసీఆర్ పదవిని పట్టుకొని వేలాడడం సిగ్గుచేటని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆదివారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి సిద్దిపేట, చింతమడకకు మాత్రమే నిధుల వరద పారించినట్లు ఆరోపించారు. గత రెండేళ్లుగా ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. సిద్దిపేట పెత్తనం ఏమిటని ప్రజలు ప్రశ్నించాలని, ప్రచారానికి వచ్చే బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఎక్కడని నిలదీయాలని పిలుపునిచ్చారు.ఈ ప్రాంత నేతలపై నమ్మకం లేకనే పక్క నియోజకవర్గాల నుంచి ఇన్‌చార్జీలను దిగుమతి చేస్తున్నారని, ఇక్కడి నేతలు ఆత్మగౌరవాన్ని చంపుకొని వారికి దాసోహం అవుతున్నారని విమర్శించారు. కెసీఆర్‌కు ఓటు వేస్తే అభివృద్ధి సిద్దిపేటకే పరిమితం అవుతుందని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిస్తేనే గజ్వేల్ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అడిగినన్ని నిధులు మంజూరు చేస్తున్నారని, నట్టేట ముంచిన ముంపు బాధితుల సమస్యల పరిష్కారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు.అభివృద్ధికి వేల కోట్లు మంజూరు చేసినట్లు చెబుతున్న కేసీఆర్ అనుచరులకు ముంపు బాధితుల కష్టాలు, ప్రజల సమస్యలు కనిపించడం లేదని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అంక్షా రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, సర్పంచులు ఛానరెడ్డి కర్ణాకర్, ఆమెరందర్‌తో పాటు పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మొనగారి రాజు, నక్క రాములు గౌడ్, నాయిని యాదగిరి, సమీర్, అజహార్, సయ్యద్ మతిన్, నక్క రేగొండ గౌడ్, ఊడేం సారిక శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్, గుంటుకు శ్రీనివాస్, గాడిపల్లి శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, మూత్రజపల్లి సత్తయ్య, నరేష్, నంగునూరి సత్యనారాయణ, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News