నేటి సాక్షి కోదాడ (అనంతగిరి) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాసరెడ్డి ఆద్వర్యంలో మల్లయ్య యాదవ్ దిష్టి బొమ్మ దగ్ధం చేసి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ముసుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలపైన చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే విరమించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బొల్లం మల్లయ్య యాదవ్ హయంలో జరిగిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి పసలేని ఆరోపణ చేస్తున్నారన్నారు.వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం,వ్యక్తిగతమైన దూషణ చేయటం సబబు కాదని తెలియజేశారు.రాజకీయాల్లో విలువలు పాటించాలని,కోదాడ అభివృద్ధి ప్రదాతలుగా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తమ దంపతులపై ఈ రకమైన విమర్శలను సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుందని ప్రజాక్షేత్రంలో మల్లయ్య యాదవ్ తీరుని ఎండగడతామని పేర్కొన్నారు.మంత్రి,ఎమ్మెల్యే లకు పిల్లలు లేరని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నోసార్లు చేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉత్తమ్ దంపతులకు బహిరంగ క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ దంపతులను విమర్చించే స్థాయి మల్లయ్య యాదవ్ కు లేదని రాజకీయ ఉండిపో కోసం వ్యక్తిగత విమర్శలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కొండపల్లి వాసు, బుర్ర పుల్లారెడ్డి,గునుకల గోపాల్ రెడ్డి,మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు,బానోతు బాబు నాయక్,వెంపటి వెంకటేశ్వరరావు,డేగ కొండయ్య,ముత్తినేని కోటేశ్వరరావు,వివిధ గ్రామాల సర్పంచులు,గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.





