*నేటి సాక్షి (కరీంనగర్)ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ రాష్ట్ర అకాడమిక్ గైడెన్స్ కమిటీ సభ్యునిగా నియామకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చిట్నేని శ్రీకాంత్ రావు గారిని కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు, విద్యావ్యవస్థకు ఏర్పడుతున్న ఇబ్బందులను పరిశీలించి రాష్ట్ర సంఘానికి నివేదించి తద్వారా అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి విద్యావ్యవస్థలో మార్పులకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో PRTU TS కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయిలేని కరుణాకర్ రెడ్డి, మర్రి జైపాల్ రెడ్డి పత్రికా సంపాదక వర్గ సభ్యులు అబ్దుల్ జమీల్ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు ముస్కు తిరుపతిరెడ్డి, మహిపాల్ రెడ్డి సోషల్ మీడియా సభ్యుడు లక్ష్మీనారాయణ సంఘ బాధ్యులు కేతిరి జీవన్ రెడ్డి, ముజీబ్,దొమ్మాట కృష్ణారెడ్డి,అంజద్ తదితరులు పాల్గొన్నారు





