Tuesday, March 10, 2026

*సిరికొండ పాఠశాలకు రూ.50 వేల విలువైన సౌండ్ సిస్టం విరాళం** ప్రవాస భారతీయుడు శనిగారపు అశోక్ సేవాభావానికి అభినందనలు—

నేటి సాక్షి – కథలాపూర్(రాధారపు నర్సయ్య)77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో సేవాభావం చాటుకున్న కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు శనిగారపు అశోక్‌ (ఇజ్రాయిల్) సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.50,000 (యాభై వేల రూపాయల) విలువైన సౌండ్ సిస్టంను విరాళంగా అందజేశారు.*పాఠశాల ఋణం తీర్చుకునే భాగ్యం*తాను చదువుకున్న పాఠశాల ఋణం తీర్చుకునే భాగ్యం కలిగిందని..తనకెంతో అందించిన పాఠశాలకు ఈ సౌండ్ సిస్టంను ఆయన అన్నయ్య కుమారుడు శనిగారపు నితీష్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ ముదాం రవి, ఉపసర్పంచ్ చిట్కూరి మల్లయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోకిని శ్రీనివాస్‌, ఉపాధ్యాయ బృందానికి అందజేశారు.*హృదయపూర్వక కృతజ్ఞతలు*ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల సమావేశాలు, కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడే సౌండ్ సిస్టంను అందించిన శనిగారపు అశోక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామస్తులు అశోక్‌ను ఘనంగా అభినందించి, భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.గ్రామాభివృద్ధి, విద్యాభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని శనిగారపు అశోక్ ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోకిని శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు వనతడుపుల రవికుమార్‌, శేఖర్‌రావు, గ్రామ సర్పంచ్ ముదాం రవి, ఉపసర్పంచ్ చిట్కూరి మల్లయ్య, కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, గాండ్ల స్వామి, శనిగారపు నితీష్‌, గాంధారి శ్రీనివాస్‌, బత్తుల నరేష్‌, మ్యాదరవేని రామాంజనేయులు, నీలి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.__________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News