నేటి సాక్షి 26 జనవరి పాములపాడు:- పాములపాడు మండలంలోనీ, 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రెవెన్యూ కార్యాలయం దగ్గర తహసిల్దార్- జి.సుభద్రమ్మ, పోలీస్ స్టేషన్ దగ్గర ఎస్ఐ- పి.తిరుపాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం దగ్గర ప్రిన్సిపాల్- ఎం.రాజ్యలక్ష్మి, జిల్లా పరిషత్ హైస్కూల్ దగ్గర హెచ్ఎం-ఎన్.శ్రీధర్ రెడ్డి, శ్రీ వివేకానంద విద్యా విహార్ హై స్కూల్ దగ్గర కరస్పాండెంట్- ఆర్ఎస్ఆర్.గోపాల్, గ్రంథాలయం దగ్గర లైబ్రరీ రియల్ సి.వి.కృష్ణారెడ్డి, వేంపెంట గ్రామ సచివాలయం దగ్గర సర్పంచ్ వై.మాణిక్యమ్మ, తదితర ప్రభుత్వ కార్యాలయం దగ్గర మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసి, రెపరెపలాడించడం జరిగింది. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాములపాడులోని, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం దగ్గర బిసిల జాతీయ ప్రధాన కార్యదర్శి-డాక్టర్ బత్తుల సంజీవరాయుడు ఆధ్వర్యంలో జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, బిజెపి జిల్లా నాయకులు చల్లా దామోదర్ రెడ్డి, సోషల్ వర్కర్ కలపండి నాగరాజు, బీసీ సంఘం నాయకుడు జి.సాయి కృష్ణ, సోషల్ మీడియా ప్రతినిధులు గోవిందు, మోసే, దక్కా శ్రీకాంత్, ఏసన్న తదితరులతో కలిసి “రాయలసీమ వెనుకబాటుతనం- మన కర్తవ్యం” కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. లింగాల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు సోషల్ వర్కర్, నవీన్ కుమార్ గౌడ్ నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య, తదితర నాయకులతో కలిసి 7 అంగన్వాడి కేంద్రాలకు కుక్కర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ జి.సుభద్రమ్మ, డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, ఎస్ఐ పి.తిరుపాలు, కేజీబీ ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎన్.శ్రీధర్ రెడ్డి, శ్రీ వివేకానంద విద్యా విహార్ హై స్కూల్ కరక్పాండెంట్ ఆర్ఎస్ఆర్.గోపాల్, గ్రంథాలయ అధికారి సి.వి.కృష్ణారెడ్డి, తదితరులు మాట్లాడుతూ మన రాజ్యాంగం చూపించిన మార్గంలో నడుచుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాం. మన హక్కులతో పాటు మనపై ఉన్న బాధ్యతలను గుర్తు చేసే రోజు ఇది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులందరికీ ఈ సందర్భంగా వినమ్ర వందనం చేస్తూ, మన రాజ్యాంగ విలువలు ఎల్లప్పుడూ మనకు దారి చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దేశం గొప్పగా ఉండాలంటే ముందుగా పౌరులు బాధ్యతగా ఉండాలి. దేశాన్ని ప్రేమించడం మాటల్లో కాదు, మన పనుల్లో, మన నడవడిలో కనిపించాలి. ఒక్క రోజు దేశం గురించి ఆలోచించడం కాదు, ప్రతి రోజు దేశం కోసం జీవించడమే నిజమైన దేశ భక్తి. మన రాజ్యాంగ విలువలే మన గుర్తింపు, మన గౌరవం, మన గమ్యం. భారతీయుడిగా పుట్టడం గర్వం, మంచి భారతీయుడిగా జీవించడం బాధ్యత అని, ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ డిటి- ఎస్.సుప్రియ, ఏ ఎస్ఓ- ఎస్.తేజశ్రీ, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు బి.ఈరమ్మ, భవాని, రాజేశ్వరమ్మ, సువర్ణ, ,జి.సోనియాదేవి, జి.శ్యామల, శశికళ, కే.కళ్యాణి, కె.జయమ్మ, వై.వి.అనురాధ, రాధమ్మ, వై.వి.రమణమ్మ, ప్రవీణ, నవ్సీత్, ఎస్.రమాదేవి, మాస్, కె.శైలజ మనిషా, నౌషిత్, జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు హైమావతి, శారద, మనోరంజని, స్వామి శేఖర్, దామరేకుల.రవి, సుబ్బ నాయక్, రాంప్రసాద్, నజీర్ భాష, శ్రీనివాసులు, ఖాజా హుసేన్, ద్రాక్షాయిని భాయి, సుహాసిని, చిన్న భారతి, శివనాగ లక్ష్మి, కె.రాజశేఖర్, విజయబాబు, ఏ.సుధాకర్, మల్లిక, మురళి, రంగారెడ్డి, రామకృష్ణ, రవీంద్రబాబు, రమణి బాయి, భవిత పాఠశాల ఉపాధ్యాయులు శంషుద్దీన్, రామ్మూర్తి, హెడ్ కానిస్టేబుల్ బి.వి.రమణ, కానిస్టేబుల్ చెన్నయ్య, మండల డీలర్ల సంఘం నాయకులు-జి.నాగభూషణరావు, ఎస్.టీ.హుసేన్, సునీల్, ఎం.శేఖర్, వీఆర్వోలు శివన్న, హుసేన్ సాహెబ్, ముర్తుజా, వేంపెంట గ్రామ వార్డ్ మెంబర్లు-లెనిన్ బాబు, గంట.రమేష్, జోసెఫ్, విజయలక్ష్మి, రఘునాయక్, సత్యనారాయణ, షాలు, నాయకులు నెమలి రమణారెడ్డి, తదితరులు పాల్గొనడం జరిగింది.





