Tuesday, March 10, 2026

జూపాడుబంగ్లా కెజిబివి స్కూల్ లో వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం అందజేసిన సీఐ టీ సుబ్రమణ్యం

నేటి సాక్షి 26 జనవరి జూపాడుబంగ్లా :—జూపాడుబంగ్లా కెజిబివి స్కూల్ లో స్వాతంత్ర వేడుకలు చాలా గొప్పగా ఘనంగా జరిగాయి.. స్వాతంత్య్రం వేడుకలకు ముఖ్య అతిథిగా రూరల్ సిఐ టి. సుబ్రమణ్యం హాజరయ్యారు.ఘనంగా స్వాతంత్ర వేడుకలు సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలి.. నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం రమేష్ బాబు ఆధ్వర్యంలో కేజీబీవీ, apswr ఆర్ పాఠశాల లో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసిన నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం . స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను భంగం కలిగించకుండా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు, కే జిబివి ఏపీ ఎస్ ఆర్ ప్రిన్సిపాల్స్,సత్యనారాయణ మూర్తి, ఏశోద మరియు ఏ ఎస్ ఐ సంజీవ, సీపీఐ మండల నాయకులు మాగబుల్ బాషా,రాజు, సలీమ్ లు పాల్గొన్నారు*తంగేడంచ స్వర్ణ గ్రామ సచివాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ….రూరల్ సిఐ టి. సుబ్రమణ్యం మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి అనేక మహనీయుల త్యాగాలను నేటి తరం వారు స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని,విద్యార్థులు మరియు పెద్దలు ప్రతి ఒక్క పౌరులు,భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన భారతదేశ ప్రభుత్వం ఆమోదించిందని భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం 12 ఆర్టికల్స్ను తయారుచేసి స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం 18 భాషలను గుర్తించి హక్కులను కలిగి ఉన్న భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండాలని విద్యతోపాటు మానవతా విలువలు తెలుసుకోవాలని ఆయన కోరారు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల 11 నెల 18 రోజులు పట్టిందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్వహస్తాలతో రచించారని విద్యార్థులకు, పెద్దలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటునే తమ విధులను నిర్వర్తించాలని ఇక్కడికి వచ్చిన వారందరికీ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని తెలుపడం జరిగింది .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News