Saturday, March 7, 2026

ఘనంగా అంబేద్కర్ రాజ్యాంగా రథయాత్ర.పాల్గొన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు

నేటి సాక్షి వికారాబాద్77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం ఎస్టి ఎస్సి, బిసి జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు బీసీ ఎస్సీ ఎస్టి జేఏసీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ రథయాత్రను ఘనంగా నిర్వహించడం జరిగింది జేఏసీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, సామాజిక గౌరవం అందించాలి. ఈ ప్రభుత్వాలు ఇవి అందించనిచో రానున్న రోజుల్లో బీసీ ఎస్ సి ఎస్ టీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, అధికారం, సామాజిక గౌరవం అందిస్తామని తెలియజేశారు అదే విధంగా 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందులో పాల్గొన్నవారు వికారాబాద్ జిల్లా బీసీ ఎస్ సి ఎస్ టీ జేఏసీ కమిటీ నాయకులు నవీన్ రాథోడ్, ఆమీర్ ఖురేషి, యాదయ్య యాదవ్, రవీందర్ మహారాజ్, రవీందర్ ముదిరాజ్, జిల్లా, మండల, గ్రామ స్థాయి జేఏసీ నాయకులు, ప్రజాస్వామ్య వాదులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News