*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ఒక అడుగు ముందున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ నోటిఫికేషన్ కు ముందే ప్రచార ఏర్పాట్లను సైతం చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు.ఇప్పటికే జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో పరిధిలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రచారం ప్రారంభించడానికి మంత్రి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం కకోసం ప్రత్యేక ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం కొండగట్టులో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.





