నేటి సాక్షి, కొడిమ్యాల మంగళవారం. 27కొడిమ్యాల మండలంలో మంగళవారం. కొడిమ్యాల, పూడూర్, తిర్మలాపూర్ రైతు వేదిక లో రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో లో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్ గారు తిర్మలాపూర్ రైతు వేదిక లో పాల్గొన్నారు. దీనిలో పీజేటీఏయూ వ్యవసాయ వీడియోలు వ్యవసాయ శాఖ వాట్సాప్ ఛానల్ సభ్యత్వం,యూరియా అధిక వినియోగంపై రైతులకు అవగాహన వీడియో ప్రదర్శించడం,వేసవి కాలం లో చిరుధాన్యాల సాగు పద్ధతులు,తేనెటీగల పెంపకంమగద స్టార్టప్ (తేనె ఉత్పత్తి) గురించి, అలాగే పశువుల ఆహారం – పశుగ్రాస ఉత్పత్తి పెంచే మార్గాలు, ఫార్మర్ రిజిస్ట్రీ మరియు శాస్త్రవేత్తలతో పరస్పర చర్చ – రైతుల సూచనలు మరియు అభిప్రాయాలు రైతు నేస్తం కార్యక్రమం లో అవగాహన కల్పించడం జరిగింది.దీనిలో మండల వ్యవసాయ అధికారి పి. జ్యోతి,తిర్మలాపూర్ సర్పంచ్ తైదల అంజయ్య, శనివారపేట సర్పంచ్ గోలి ఐలయ్య, ఉపసర్పంచులు(తిర్మలాపూర్. శనివారంపేట్) , AEO గ్రీష్మ, రాజేష్, తేజస్విని మరియు రైతులు పాల్గొన్నారు.





