నేటి సాక్షి, కొడిమ్యాల మంగళవారం.27 తిమ్మయ్యపల్లి గ్రామము లో జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్.పసుపు, నువ్వులు. వరి. పంటలను పరిశీలించారు. రైతు నేస్తం కార్యక్రమం అనంతరం పసుపు కోత చేపడుతున్న రైతు డబ్బు లచిరెడ్డి ఫీల్డ్ ను సందర్శించి రైతు తో మాట్లాడి పసుపు పంట వివరాలు తెలుసుకోవడం జరిగింది.అలాగే ప్రత్తి పంట కొత అనంతరం నువ్వులు సాగు చేపట్టిన ఫీల్డ్ ను సందర్శించి, యాసంగి సాగు కి నువ్వుల పంట వేసుకోవాలని సూచించారు. అలాగే వరి పంటను సందర్శించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి పి.జ్యోతి,మాజీ ఉపసర్చంచ డబ్బు ముత్యం రెడ్డి.రైతులు పాల్గొన్నారు.





