Tuesday, March 10, 2026

*శిక్షణ టీచర్లకు ఈఎల్సి మంజూరు చేయాలి**డీఈఓకు తపస్ నేతల వినతి*—————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………………………..ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణలో పాల్గొన్న వారికి ఈఎల్సి మంజూరు చేయాలనీ తపస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ప్రసాద్ రావు కోరారు.మంగళవారం జగిత్యాల జిల్లా విద్యాధికారికీ తపస్ నేతలు ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి కొక్కుల రాజేష్ తదితరులు వినతిపత్రం అందజేశారు.*ఈ సందర్బంగా ప్రసాద్ రావు, రాజేష్ లు మాట్లాడుతూ*2025 వేసవి సెలవుల్లో ప్రభుత్వం జగిత్యాల జిల్లా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం నిర్వహించిందని వారు తెలిపారు.అయితే శిక్షణలో పాల్గొన్న టీచర్లందరికి ఈఎల్సి మంజూరు చేయాలనీ, ఇట్టి విషయంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు చేయాలనీ తపస్ నేతలు డీఈఓ ను కోరారు.కార్యక్రమంలో తపస్ జిల్లా బాధ్యులు రఘునందన్, రజినీకాంత్ లున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News