Tuesday, March 10, 2026

ఎర్రజెండా విజయమే లక్ష్యం.. సీపీఐ అభ్యర్థులను గెలిపించాలి– జిల్లా కార్యదర్శి మంద పవన్ పిలుపు

నేటి సాక్షి గజ్వేల్….సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ ఎన్నో విజయాలు సాధించిన పార్టీ సీపీఐ అని అన్నారు. ప్రజల పక్షాన నిలిచే ఎర్రజెండా పోరాటాలే ఈ విజయాలకు నిదర్శనమని తెలిపారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిద్ధిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న సీపీఐ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఓట్లేసి గెలిపించాలని ఆయన కోరారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు నుంచి శివలింగ కృష్ణ సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, పట్టణ ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు.మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లే కాలువ ద్వారా రబీ సీజన్‌లో రైతులకు సాగునీరు అందించి వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మంద పవన్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బట్టు దయానంద రెడ్డి, రాజేశం, రామచంద్రం తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News