నేటి సాక్షి నారాయణపేట జనవరి 26 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ దేవత తల్లి జాతర మహోత్సవలు వైభవంగా వైభవంగా జరిగాయి. నారాయణపేట మాజీ డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జి కుంభం శివకుమార్ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మవ్వకి మొదటి పూజ నిర్వహించిన కుమ్మం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా, నియోజకవర్గ ప్రజలు, యువకులు, రైతులు అందరూ సంతోషంగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, భక్తులు, గ్రామస్తులు మండల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందారు





