*నేటి సాక్షి, గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండల కేంద్రంలో నేటి నుండి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం రోజున సాయంత్రం సారలమ్మ గద్దెకు వచ్చుట మరియు గోవింద రాజు పగిడిద్ద రాజులు గద్దెలకు వచ్చుట గురువారం రోజున సమ్మక్క గద్దెకు వచ్చుట శుక్రవారం రోజున మొక్కుబడులు సమర్పించు కొనుట అనంతరం శనివారం రోజున తిరిగి వన ప్రవేశం నిర్వహిస్తారు. ఈ నాలుగు రోజులపాటు జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బోయిని పోచయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం వైద్య సదుపాయం కరెంటు సదుపాయం ఏర్పాటు చేశారు. కరీంనగర్ నుండి ప్రతి గంటకు బస్సు సౌకర్యం అలాగే గుండ్లపల్లి నుండి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బోయిని పోచయ్య కూన ఎల్లయ్య, బొడ్డు భూపతి, బుర్ర తిరుపతి గౌడ్, న్యాత సుధాకర్, దేశరాజ్ కనుకయ్య, బుర్ర మల్లయ్య గౌడ్, బోయిని మల్లయ్య, తేళ్ల బక్కయ్య, గూడూరు నవీన్, సమ్మయ్య, కయ్యం మహేష్, కొలుపుల మహేందర్, తదితరులు పాల్గొన్నారు. జాతరలో ఎలాంటి అవమాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై జి. నరేందర్ రెడ్డి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.





