Tuesday, March 10, 2026

*ఛాతిలో నొప్పని వచ్చి..శవమై శ్మశానానికి చేరి..*———————————* పట్టించుకోక..’పేషెంట్’ ప్రాణం పోగొట్టారా.?* కోరుట్లలో ఓ ‘మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’లో 70 ఏళ్ల వృద్ధుడి మృతి * గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్లు అందుబాటులో లేరా.?* ‘పేషెంట్’ ను..’హాస్పిటల్’లో ‘అడ్మిట్’ చేసి వెళ్లిపోయిన ‘ఆర్ఎంపి’ * డాక్టర్ లేనప్పుడు.. పేషెంట్ ను ఎందుకు రాత్రంతా ఉంచారు.?* తెల్లవారుజామున ఛాతిలో వచ్చిన నొప్పి..’హార్ట్ ఎటాకా’.?* వృద్ధుడి మృతి విషయం బయటకు రాకుండా గ్రామానికి తరలించిన హాస్పిటల్ యాజమాన్యం* ఆర్ఎంపి లకు బిల్లులో 60 శాతం ఇస్తే చాలు.. పేషెంట్ ఏమైనా పర్లేదంట.!—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ‘ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్’ వైద్యులు మరోసారి ఉత్తుత్తి వైద్యం చేసి ‘బండకు బండున్న మనిషి’ ప్రాణాలను తీశారు.! ‘ఛాతి’లో నొప్పిగా ఉందని తనకు తెలిసిన ‘ఆర్ఎంపి’ వద్దకు వెళితే..ఆయన వీలైనంత వరకు జేబులు నింపుకుని.. కమీషన్ లకు కక్కుర్తి పడి ‘అర్హత’ లేని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’లో చేర్పించాడు.తీరా.. అక్కడ ‘గణతంత్ర దినోత్సవ’మని వైద్యులు అందుబాటులో లేరో.? లేక..’పేషెంట్’ ఎవరైనా వస్తేనే ‘ఆ-స్పెషలిస్టు డాక్టర్’ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారో.? తెలీదు కానీ.. అడ్మిట్ అయిన ఆ రాత్రి..ఆ పేషెంట్ ను హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో .. మంగళవారం తెల్లవారుజామున వృద్ధుడు ఛాతిలో నొప్పితోనే మృతి చెందారు.దీంతో ఈ విషయం బయటకు పొక్కకుండా ఎంత దాచిపెడదామని ప్రయత్నించినా.. ఆనోటా ఈ నోటా బయటకు పొక్కింది.! ఇంతకూ..ఆ వృద్ధుడు ‘ఛాతిలో’ నొప్పితో చనిపోయాడా.? ‘హార్ట్ ఎటాకా’.? అన్నది తేల్చకుండానే ‘హాస్పిటల్ యాజమాన్యం’ గుట్టుచప్పుడు కాకుండా చేతులు దులిపేసుకున్న వైనం చర్చానీయాంశమైంది.!*ఇంతకూ..ఏం జరిగిందటాంటే.?*కథలాపూర్ మండలం తక్కళ్లపల్లికి చెందిన గాండ్ల లింగం (70) అనే వృద్ధుడు సోమవారం నాడు ఛాతిలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై..అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపి విజయ్ వద్దకు వెళ్లారు. ఆయన తనకు వచ్చిన సగంసగం వైద్యంతో ట్రీట్మెంట్ ఇచ్చి..నీకు ‘నంజు’లెక్కైంది..అని ఎలాంటి పరీక్షలు చేయకుండానే తేల్చి.. కోరుట్ల పట్టణంలోని ఓ ‘కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’లో సోమవారం చేర్పించారు. అయితే, గణతంత్ర దినోత్సవం రోజని ‘ఆ-కాంట్రాక్టు డాక్టర్’లు ఎవరూ లేకపోవడంతో అతన్ని ఆరోజు అడ్మిట్ చేసి వెళ్లిపోయారు. కాగా..ఆ రాత్రి అతన్ని ఏ డాక్టర్..ఏ సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడంతో నొప్పి తీవ్రమైంది. తెల్లవారుజామున పేషెంట్ గాండ్ల లింగం బాత్ రూమ్ కని వెళ్లి ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందడంతో ఒక్కసారిగా సిబ్బందిలో ఆందోళన వ్యక్తమైంది.సరైన సమయంలో వైద్యం అందలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వెంటనే బంధువులు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే వృద్ధుడు మరణించాడని ఆందోళన చేపట్టారు.దీంతో సిబ్బంది యాజమాన్యానికి సమాచారం అందించడంతో విషయం గుట్టుచప్పుడు కాకుండా మృతి సమాచారం బయటకు పొక్కకుండా ‘పెద్దలను’ ఆశ్రయించారు.ఈ ఘటన వెనుక ఆర్ఎంపీ వైద్యులు–పెద్ద ఆసుపత్రుల మధ్య ఉన్న కమీషన్ అగ్రిమెంట్లు, వైద్య నిర్లక్ష్యం, కార్పొరేట్ వైద్య దోపిడీ కోణాలు బయటపడుతున్నాయి.*వృద్ధుడి మృతి విషయం దాచిపెట్టే యత్నం..?*వృద్ధుడు మృతి చెందిన విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం అతని మృతదేహాన్ని ‘గుట్టుచప్పుడు’ కాకుండా నేరుగా తక్కళ్లపల్లికి పంపించి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం రాద్ధాంతం కాకముందే కోరుట్లకు కొందరు ‘పెద్దలు’ గ్రామంలోని ‘పలుకుబడి గల వ్యక్తుల’తో మాట్లాడి వ్యవహారాన్ని ‘సెట్టిల్’ చేయాలని ప్రయత్నించినా అది ఫలించలేదని సమాచారం.కాగా.. సరైన సమయంలో..’వైద్యం అందక రోగి మృతి చెందాడట’న్న సమాచారంపై వివరణ కోరేందుకు ప్రయత్నించిన ‘నేటి సాక్షి’కి డాక్టర్ లు కానీ.. యాజమాన్యం కానీ.. అందుబాటులో లేకపోవడం గమనార్హం.!*కమీషన్ల కక్కుర్తి..!*కోరుట్ల పట్టణంలోని పెద్ద ఆసుపత్రులు గ్రామాల్లో ఉన్న ఆర్ఎంపీ వైద్యులతో మౌఖిక అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు బహిర్గతమవుతున్నాయి. ప్రతీ రూ.10 వేల బిల్లులో రూ.6 వేలు ఆర్ఎంపీలకే చెల్లించేలా ఒప్పందాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. ఇందుకోసం ఆసుపత్రి యజమానులు ప్రత్యేకంగా ‘ఫీల్డ్ విజిటర్లు’ను నియమించుకుని నెలకు రూ.15 వేల జీతాలు ఇస్తూ ఆర్ఎంపీలను తమవైపు తిప్పుకుంటున్నారని ‘బయట టాకు’.! ఆర్ఎంపి ల దగ్గరకు ఊరోళ్ళు ఏయే అవస్థలతో వస్తే..ఆయా ‘స్పెషలిస్టు’ హాస్పిటల్ లకు తీసుకెళుతూ తమ జేబులు నింపుకుంటున్నారీ చోటా మోటా డాక్టర్ లనబడే వారు.!*ఊరిలో పేషెంట్ల వేట.. పట్టణంలో హాస్పిటల్లలో బిల్లుల్లో వాట.!*గ్రామాల్లో ఆర్ఎంపీలు మొదట రోగులపై ప్రయోగాత్మక వైద్యం చేస్తూ జేబులు నింపుకుంటారని, పరిస్థితి చేజారితే మాత్రమే పెద్ద ఆసుపత్రులకు తరలించి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. తీరా ఆసుపత్రికి వచ్చిన తర్వాత పేషెంట్ ఆర్థిక స్థితి బట్టి అనవసర టెస్టులు, భారీ బిల్లులతో దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఊర్లల్లో పేషెంట్లను వేటాడుతూ..తమకు అనుకూలంగా ఉండే ఆసుపత్రుల పేర్లు చెబుతూ..తానే ‘రిఫర్’ చేసినట్లు చెప్పించుకుని..ఆ తర్వాత తామే స్వయంగా వచ్చి ’60 శాతం కమీషన్’ జేబులో వేసుకుని వెళ్తుంటారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.*నామమాత్రపు ట్రీట్మెంట్.. ప్రాణాల నష్టం*ఆర్థికంగా బలహీనులైన రోగులకు సీనియర్ డాక్టర్లు మొదటిసారి మాత్రమే చూసి, ఆ తర్వాత కింది స్థాయి వైద్య సిబ్బందికి అప్పగించేస్తారని, వారి మిడిమిడి జ్ఞానపు వైద్య పరిజ్ఞానం, నిర్లక్ష్యం వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.*హార్ట్ ఎటాకా..? నిర్లక్ష్యమా..?*ఛాతిలో నొప్పి వస్తే అది ‘హార్ట్ ఎటాక్’ అంటూ భయపెట్టి పట్టణాలకు తరలించడం ఆర్ఎంపీలకు అలవాటైందని విమర్శలు ఉన్నాయి. నిజంగా గాండ్ల లింగం గుండెపోటుకు గురయ్యారా..? లేక సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారా..? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News