బుగ్గారం మండలం శేకల్ల గ్రామానికి చెందిన దొనకొండ అజయ్ అనే యువకుడు 100 మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయికి ఎంపికయ్యాడు. చిన్ననాటి నుండి ఆటలలో అభిరుచి ఎక్కువగా ఉండడం వల్ల పట్టుదలతో జిల్లా స్థాయి పరుగు పందెంలో ఎంపికయ్యారని అజయ్ తల్లిదండ్రులు తెలిపారు. శనివారం నాడు పరుగుపందంలో ఎంపికైన అజయ్ ని గ్రామ సర్పంచ్ పర్స రమేష్ సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువత మొబైల్ ఫోన్, ఆల్కహాల్ మద్యం లాంటి వ్యసనాలకు అలవాటు పడకుండా ఆటల పట్ల అభిరుచి పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అదేవిధంగా మానసిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వార్డు సభ్యులు నంది తిరుపతి తదితరులు ఉన్నారు





