చిలుకూరు07 ఫిబ్రవరి 2026 నాడు చిలుకూరు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధి ని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గారు సందర్శించి యూరియా సరఫరాను మరియు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను గురించి రైతులతో మాట్లాడి సమస్యలను గురించి చర్చించారు. యూరియా కొరత అనేది లేదని జిల్లాలో కావలసినంత యూరియా అందుబాటులో ఉందని అవసరాన్ని బట్టి ప్రతి మండలానికి యూరియా పంపించడం జరుగుతుందని తెలియజేశారు. రైతులు ఆందోళన చెందకుండా అవసరమైనప్పుడు మాత్రమే యూరియా ని బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. రైతులందరూ మండల పరిధిలోని ఎక్కడైనా యూరియాను ఆన్లైన్లో యాప్ ద్వారా బుక్ చేసుకుని 24 గంటల్లో తీసుకోవాల్సిందిగా రైతులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రశాంతి కుమారి, వ్యవసాయ అధికారి దేవ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారులు చంద్రశేఖర్, వ, శిరీష, రైతులు లక్ష్మీనారాయణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.





