నేటి సాక్షి శివకుమార్* సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబరాలు. మంగళవారం ఉదయం నుండే పట్టణాల్లోని వాడవాడలా అబాలగోపాలం రంగుల ఉత్సవంలో మునిగిపోయారు. సిరిసిల్లలోని శాంతినగర్, సుభాష్ నగర్, విద్యానగర్, గణేష్ నగర్ వంటి కాలనీల్లో కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారులు తమ పిచ్కారీలతో సందడి చేయగా, పండుగకు మరింత కళను తెచ్చారు.సిరిసిల్ల నేతన్నల నగరంలో రంగుల హోలీ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని స్థానిక ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.





