నేటి సాక్షి మంచిర్యాల జిల్లా లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఐబీ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి మానవతా సందేశాన్ని చాటిచెప్పారు.తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో అల్పాహార కార్యక్రమం నిర్వహించి సేవా కార్యక్రమాలను కొనసాగించారు. అనంతరం ఐబీ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు సిద్దు,జిల్లా నాయకులు తన్నీరు మధుకర్ మాట్లాడుతూ…. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నదని తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత 12 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జనసేన కార్యకర్తలకు గర్వకారణమని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లోనే కీలక నాయకుడిగా ఎదుగుతారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ నాయకులు విష్ణు, పిట్టల సుధాకర్, ఆవుల సాగర్, మేకల సుధాకర్, రంజిత్, గంధం నవీన్, 45వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పిట్టల సంధ్యారాణి, 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కుమారి హర్షిత, రమేష్, రాకేష్, రఫీ, సురేందర్ రెడ్డి, సాయికుమార్ తదితర జనసేన నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు





