నేటి సాక్షి గజ్వేల్ :—- గజ్వేల్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రావు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆరోపించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నిరంతరం నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటే, గజ్వేల్ ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గంలో తన సొంత ఫామ్ హౌస్లో ఉండి కూడా ప్రజలను కలవడం లేదని ఆయన విమర్శించారు. గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ మజీద్లో సయ్యద్ బాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు, మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి పనిచేస్తోందన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న రాజ్యాధికార పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.మైనార్టీలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని, ముస్లింల అభివృద్ధి కోసం సరైన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ప్రభుత్వాలను ఆయన విమర్శించారు.ఈ కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ నాయకులు జ్యోతి పండాల్, బిక్షపతి, నర్సింగ్లతో పాటు సంగాపూర్ ప్రాంతానికి చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





