నేటి సాక్షి,నారాయణపేట, మార్చి 15, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దాదాపు 9 సంవత్సరాల పైగా ప్రతి పంటకు ఎకరాకు ఏడాదికి వర్షాకాలం మరియు వేసవి పంటలకు ఏడాదికి రెండు పంటలకు ఎకరాకు రూ, 5000 రూపాయలు చొప్పున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాట రంగా రైతులకు అప్పట్లో జమ చేసేవారని రైతులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతు బంధు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది రెండు సంవత్సరాలకు పైగా కావస్తున్న కేవలం ప్రస్తుత ప్రభుత్వం ఒక పంటకు మాత్రమే రైతులకు అకౌంట్లో జమ చేసిందని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాగా మార్చడం జరిగింది. అప్పటిలో టిఆర్ఎస్ ప్రభుత్వం గుట్టలకు తోటలకు బీడు భూములకు రైతు భరోసా డబ్బులు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చర్చించుకుంటున్నారని విమర్శలున్నాయి. రైతుబంధు వల్ల చిన్న కారు సన్న కారు రైతులకు మేలు జరుగుతుందని పంట పెట్టుబడి సమకూర్చుతుందని రైతులు చర్చించుకుంటున్నారు. 100 ఎకరాలకు ఇవ్వకున్నా వారు ఏమీ అడగరని 10 ఎకరాలు ఉన్న రైతులు మాత్రమే రైతుల భరోసా పథకాన్ని ఆశిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో మేధావి వర్గం అభిప్రాయాన్ని చెబుతున్నారు. రైతు బంధు పథకాన్ని పరిచే ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకి తీసుకోవాలని అనుకుంటున్నారు. వెంటనే రైతు బంధు పథకాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని పేట జిల్లా రైతులు కోరుతున్నారు.





