నేటి సాక్షి మార్చ్ 15 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ లో ఇటీవల బెల్లంపల్లి ఏరియా గోలేటి ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ లో సీనియర్ ఈపి ఆపరేటర్ గా 35 సంవత్సరాలు సింగరేణి లో విధులు నిర్వహించి రిటైర్డ్ మెంట్ అయిన స్నేహశీలి , మృదు స్వభావి , మంచికి మారుపేరు , మనసున్న మహారాజు , సేవ నిరతుడు , దైవ భక్తి కలవాడు, కార్మిక సంఘం నాయకుడు, బెల్లంపల్లి లో సొంతగా జిమ్ ఏర్పాటు చేసి కార్మిక , కర్షక విద్యార్థి మేధావులకు , మహిళలకు కూడా ఫిట్నెస్ , ఆరోగ్య పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్న మిత్రుడు, తెలంగాణ ఉద్యమ కారుడు , శ్రీ మురహరి గారిని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ రోడ్ నంబర్ 1 లో అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం జిమ్ ను ఏర్పాటు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసినారు. అదే విధంగా శ్రీ మురహరి గారిని వారి కుటుంబ సభ్యుల ను ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆశీర్వదించాలని ప్రార్థించినారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్ళబండి రాజన్న , ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ గంగయ్య , విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు నిచ్చకోళ్ల అంజయ్య , రమేష్ అన్న S&PC రిటైర్డ్ ఇన్స్పెక్టర్ , ఆర్ రామ్ లాల్ , కస్తూరి సూర్యం , కోడూరి శంకర్ , ముత్యాల రాజమల్లు , పులి కృష్ణ , ఏల్పుల ప్రభాకర్ , ఏ శంకరయ్య , ముత్తె భనయ్య , దుర్గం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిలాలి ✊🏻పోరాడుదాం కరువు భత్యం తో కూడిన 50% కోల్ మైన్స్ పెన్షన్ పెంపుదల కోసం ✊🏻





