నేటి సాక్షి,నారాయణపేట, ఏప్రిల్ 17,రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), టీజిఈ, జేఏసీ పిలుపు మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ లో ఉపాధ్యాయ బృందం శుక్రవారం నాడుభోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జితో నిరసన కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ లో నిర్వహించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ…. పిఆర్సి నివేదికను వెంటనే తెప్పించుకొని 51% ఫిట్మెంట్అమలు చేయాలి పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను ఒకేసారి ఏక మొత్తంలో చెల్లించాలి. నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను అమలుపరచాలి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయాలి.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి, మధుసూదన్,భాను ప్రకాష్, మంగళ లక్ష్మణ్,నిర్మల, శిరీష, శశిరేఖ,ప్రతాప్,నరసింహ రఘురాం రెడ్డి ప్రాథమిక పాఠశాల జాజాపూర్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, రజిత ,సాయి కృష్ణ, మాణిక్యప్ప,నారాయణ తదితరులు పాల్గొన్నారు.





