Friday, April 17, 2026

రోడ్డుకు అడ్డంగా ఉన్న డబ్బును తొలగించండి…..గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు…… అప్పంపల్లి గ్రామ యువకుల వినతి….. నేటి సాక్షి , నారాయణపేట, ఏప్రిల్ 17,,(రిపోర్టర్ ఇమామ్ సా బ్ ),

నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో ని స్వామి వివేకానంద చౌరస్తాలో రహదారిలో రోడ్డుకు అడ్డంగా వేసిన డబ్బాను తొలగించాలని అప్పంపల్లి గ్రామానికి చెందిన యువకులు శశివర్ధన్ రెడ్డి, మధుసూదన్,రాజన్నలు శుక్రవారం స్థానిక విలేకరులతో తెలిపారు. అప్పంపల్లి గ్రామ యువకులు మాట్లాడుతూ అప్పంపల్లి గ్రామంలోని స్వామి వివేకానంద చౌరస్తాలోని రోడ్డుకు అడ్డంగా వేసిన డబ్బాను ఎందుకు తొలగించడం లేదని యువకులు తెలిపారు.డబ్బాను తొలగించాలని గత నెల రోజుల కిందట వినతి పత్రాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమర్పించిన పట్టించుకోవడం లేదన్నారు. ఇట్టి విషయంపై మండల స్థాయి అధికారులు స్పందించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ యువకులు హెచ్చరించారు.ఇట్టి విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శి జ్యోతి తో వివరణ కోరగా అప్పంపల్లి గ్రామంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో గల రోడ్డుకు అడ్డంగా వేసిన తప్పని తొలగించేందుకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని ఆమె వివరించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న డబ్బును తొలగిస్తామని ఆమె తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News