నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్(ఎండి ముబీన్): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త షేక్ షాబాజ్ హుస్సేన్ గారు మానవత్వానికి నిలువుదోరగా నిలిచారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాగజ్‌నగర్‌కు చెందిన ఒక మహిళ రక్తహీనతతో బాధపడుతూ అత్యవసరంగా రక్తం అవసరం ఉన్న విషయం తెలిసిన వెంటనే, “నేనున్నాను” అంటూ ముందుకు వచ్చి రక్తదానం చేశారు.ఆయన చేసిన ఈ సేవతో మహిళ ప్రాణాపాయం నుండి బయటపడగా, ఆమె కుటుంబ సభ్యులు షేక్ షాబాజ్ హుస్సేన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.సమాజంలో ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తులు మరింత మంది ముందుకు రావాలని స్థానికులు అభినందించారు.





