Monday, April 20, 2026

హెడ్లైన్ : ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పై అవగాహన

నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 20 పెద్దకడుబూరు మండల పరిధిలోని మెయిన్ ఎంపీపీ పాఠశాలలో సోమవారం ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు పెంపుదల లక్ష్యంగా మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎంఈవో రామ్మూర్తి ఆధ్వర్యంలో గ్రామంలో విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నినాదాలతో ముందుకు సాగారు. “ప్రతి బిడ్డకు విద్య హక్కు”, “పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమం” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. తల్లిదండ్రులను నేరుగా కలుసుకుని తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎంఈవో రామ్మూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు, మధ్యాహ్న భోజన పథకం వంటి అనేక సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా బోధన జరుగుతోందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని వివరించారు. అదేవిధంగా, కొత్తగా ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత పాఠశాల హెడ్‌మాస్టర్‌ను సంప్రదించి తమ పిల్లలను నమోదు చేయాలని సూచించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News