Tuesday, April 28, 2026

మధుసూదన్ కు కన్నీటి వీడ్కోలు….-కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి-నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు, ప్రజాసంఘాలు నేతలు

నేటిసాక్షి, మిర్యాలగూడ : ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, మిర్యాలగూడ పట్టణ వాస్తవ్యులు మారబోయిన మధుసూదన్ సోమవారం గుండెపోటు మరణించారు. సమాచారం అందుకున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మంగళవారం మధుసూదన్ పార్ధీవదేహానికి పూలమాలలు వేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇంచార్జులు, సర్పంచ్ లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News