నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 30 ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థిని ఎస్. దీపిక ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 988 మార్కులు సాధించి ఘనవిజయం సాధించింది. తన ప్రతిభతో కళాశాలకే కాకుండా మండలానికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.దీపిక ప్రతిభను గుర్తించిన విద్యాశాఖ ఆమెను ప్రతిష్టాత్మక ‘షైనింగ్ స్టార్’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకోవడం విశేషంగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ఉపాధ్యాయులు దీపికను అభినందిస్తూ ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, దీపిక భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే మరెన్నో విజయాలు సాధించగలదని సూచించారు.దీపిక విజయంతో గురుకుల కళాశాల విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఆమె విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది విద్యార్థులు కృషి చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులు సూచించారు.





