Thursday, April 30, 2026

రైతులు యూరియా అధిక వాడకం తగ్గించాలి -సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్.వి శ్రీధర్

నేటిసాక్షి, మిర్యాలగూడ : రైతులు పంట సాగులోయూరియా వినియోగాన్ని తగ్గించాలనిసీనియర్ శాస్త్రవేత్త డాక్టర్.వి శ్రీధర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం, సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాని నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలోని కొండ్రపోల్ గ్రామంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్.వి శ్రీధర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.మార్కెట్లో డిమాండ్ లో ఉన్న వరి పంట రకాలు మరియు వ్యవసాయ వర్సిటీ వరి రకాల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరంఉద్యాన శాస్త్రవేత్తలు టి. హిమబిందు రైతులు పంటమార్పిడి ఆవశ్యకత గురించి రైతులకు వివరించారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల గురించి, పంట వైవిధ్వాకరణ మరియు పండ్లు కూరగాయలు సాగు మరియు నీటి ఆదా పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరంమిర్యాలగూడ ఉద్యాన అధికారి షేక్. నసీమ మాట్లాడుతూ, ఉద్యాన శాఖ రైతులకు అందిస్తున్న సబ్సిడీలు, పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమండల వ్యవసాయ అధికారి ఎన్. బాలకృష్ణ ,ఏఈఓ సైదులు,కొండ్రపోల్ సర్పంచ్ శ్రీమతి రాధా రామలింగం, దిలావర్ పూర్ సర్పంచ్ బెజ్జం సైదులు, ఎంఏఓ దామరచర్ల, మిర్యాలగూడ క్లస్టర్ ఎచ్ఓ, ఏఈఓ, సైదులు, మట్టారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, శాస్త్రవేత్తలు హిమబిందు, ఆదర్శ రైతులు కొడాలి ప్రభాకర్, రమణ మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News