నేటి సాక్షి మే 06 పాములపాడు:- పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన బోయ.పెద్ద స్వాములు అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకుని మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ వారి నివాసానికి వెళ్లి పూలదండ వేసి, నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు తరఫున 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పెద్ద స్వాములు మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ విషయం తెలుసుకొని సింగపూర్ నుంచి అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు కూడా తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్నీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శివకుమార్, చిన్నస్వామి ఆచారి, సుబ్బారావు, రత్నాకర్, డీలర్ మధు, జనసేన శేషు, గుర్రప్ప, స్వామినాయుడు, నరేష్, మధుశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.





