నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………..జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మెడ్‌వేవ్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం.ఈ సందర్భంగా తేదీ 12-05-2026 న జగిత్యాల IMA హాల్‌లో నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి సంబంధించిన పోస్టర్‌ను చైర్‌పర్సన్ కి అందజేసి, శిబిరానికి మున్సిపల్ సిబ్బంది, కార్మికులను కూడా స్క్రీనింగ్ కొరకు పంపించాలని కోరారు.ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి, ప్రారంభ దశలోనే క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవడం ద్వారా మెరుగైన చికిత్స పొందవచ్చని వైద్యులు తెలిపారు. ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చైర్‌పర్సన్ సూచించారు.ఈ కార్యక్రమములో కమిషనర్ సత్య ప్రణవ్, డా. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, డా. పులిగోళ్ళ హారిక మరియు తదితరులు ఉన్నారు.





