Thursday, May 14, 2026

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శి కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

నేటిసాక్షి, మిర్యాలగూడ : కొండూరు నరసయ్య స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల(కెఎన్ఎం) ఎంతో మంది మేధావులను తయారు చేసిందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలిచిందని, కళాశాలప్రిన్సిపల్ మల్గిరెడ్డి భీమార్జున రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల” కార్యక్రమంలో భాగంగా “విద్యా వారోత్సవాల” సందర్భంగా పట్టణంలోని ఈదులగూడలో ఉన్న కె.ఎన్.ఎం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4వ రోజు గురువారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, కళాశాల అభివృద్ధిలో ప్రతి పూర్వ విద్యార్థి తమ యొక్క సహాయ సహకారాలు అందించాలని కళాశాల కోరారు. పేద విద్యార్థులను జ్ఞాన సంపన్నులుగా చేసేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలే కనుక వాటిని కాపాడుకోవలిసిన బాధ్యత మనందరిదని, ఎంతో మంది విద్యార్థులను ఈ కళాశాల ఉన్నత స్థాయిలో నిలిపిందని, ప్రతి పూర్వ విద్యార్థి కళాశాల అభివృద్ధికి తమ సహాయ సహకారాలను అందించాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బిపి, షుగర్ పరీక్షల నిర్వహణ…..లయన్స్ క్లబ్, వర్షిత హాస్పిటల్ డా.రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కంటి పరీక్షలను, బిపి, షుగర్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ వారి సేవలు ఎల్లప్పుడూ తమ కళాశాలకు ఉండాలని, రానున్న రోజుల్లో మరో గొప్ప మెగా హెల్త్ క్యాంపు తమ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు, దానికి వారి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల జనరల్ సెక్రటరీ గోళ్ళ సుధాకర్, ట్రెజరర్ ఆర్. నర్సిరెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బి.ఎం. నాయుడు, మెంబర్ లింగయ్య, సత్యనారాయణ రెడ్డి, వర్షిత హాస్పిటల్ నిర్వాహకులు కె. రాంబాబు, డా.కావ్య కళాశాల అధ్యాపకులు, అద్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News