Thursday, May 14, 2026

*తండా బీటీ రోడ్డును పరిశీలించిన చౌడాపూర్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్*

నేటి సాక్షి, చౌడాపూర్ (సురేష్ మోత్కూర్.)పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి చొరవతో శరవేగంగా కొనసాగుతున్న చిన్న మేగ్య తండా బీటీ రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాకలిపల్లి చెంద్రశేఖర్.పరిగి ఎమ్మెల్యే చెరువుతో చౌడాపూర్ మండలంలో అన్ని గ్రామాలకు రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్న అతి త్వరలో అవి కూడా పూర్తవుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ… మన ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి గూడానికి ప్రతి తండాకు ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని సంకల్పంతో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ చిన్న తండాలకు కూడా బీటీ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ పనుల్లో జాప్యం జరగకుండా నాణ్యత లోపాలు లేకుండా పనులు జరగాలని కాంట్రాక్టర్లకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి నీర్ సబ్ తండా సర్పంచ్ నారాయణ, మరికల్ నరసింహులు, మొగుళ్లపల్లి రవి, కొత్తపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News